సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు

5 Dec, 2023 15:12 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు మాత్రమే పాటిస్తానని వెల్లడించారు. తానొక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పేర్కొన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలకు గాను 163 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను సాధించగా.. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత తగ్గింది. 

మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సమష్టిగా ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. 

సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని పుకార్లు పుట్టాయి. అటు.. శివరాజ్ సింగ్‌నే సీఎం గా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవిపై తాజాగా శివరాజ్ సింగ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్


 

>
మరిన్ని వార్తలు