ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్

5 Dec, 2023 13:23 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు.

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్‌ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. 

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి:  Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే!

>
మరిన్ని వార్తలు