-

వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం

27 Nov, 2023 04:57 IST|Sakshi

కాకినాడలో యువ వైద్యుడి బలవన్మరణం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై బురదజల్లే ప్రయత్నం

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

వెంటనే రాజకీయం చేయాలని చూసిన లోకేశ్, టీడీపీ, జనసేన నేతలు

ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడన్న తల్లి

కన్నబాబు, కల్యాణ్‌కు సంబంధం లేదని స్పష్టీకరణ

దీనిపై రాజకీయం చేయొద్దని వేడుకోలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైఎస్సార్‌సీపీకి, ప్రభుత్వా­నికి ముడిపెట్టి రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిపోయింది. జరిగిన ఘటన ఏది, దాని వెనుక కారణాలేమిటి అన్న విచక్షణ కూడా లేకుండా విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారు. కాకినాడ­లో ఓ యువ వైద్యుడి ఆత్మహత్యనూ వివాదాస్పదం చేసి, రాజకీయం చేసేందుకు విపక్షాలు విఫల­యత్నం చేశారు.

ఆయన ఆత్మహత్యకు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు కల్యాణ్‌ కారణ­మ­ం­టూ కొందరు సోషల్‌ మీడి­యాలో ప్రచారం చేశా­రు. టీడీపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయి అసత్య ఆరో­ప­ణలు చేశారు. అయి­తే, వై­ద్యు­డి ఆత్మహత్యకు ఆర్థిక కా­రణాలే కారణమని ఆయ­న తల్లి చెప్పడంతో విపక్షాల వ్యూహం బెడిసికొట్టింది.

జరిగిందిదీ..
కాకినాడ అశోక్‌ నగర్‌కు చెందిన డాక్టర్‌ నున్న శ్రీకిరణ్‌ రష్యాలో వైద్య విద్య చదివాడు. కాకినాడలో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆయన తన ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైఎస్సార్‌సీపీకి చెందిన కురసాల కన్నబాబు, కల్యాణ్‌తో భూవివా­దం కారణంగానే వైద్యుడు శ్రీకిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు సోషల్‌ మీడియాలో ప్రచా­రం చేశారు.

ఆ వెంటనే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయ­త్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూ దందాలు, హత్యలు పెరిగిపో­యా­యంటూ వెనుకాము­ం­దూ చూసుకోకుండా ట్వీట్‌ కూడా చేశారు. కుమా­రుడి ఆత్మహత్యతో విషాదంలో ఉన్న అతడి తల్లి శేషారత్నాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ, జనసేన నాయకులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి కొద్దిసేపు హంగామా చేశారు. ఈ ఉదంతాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించారు.

రాజకీయానికి వాడుకోవద్దు: తల్లి శేషారత్నం
అయితే అసలు వాస్త­వాన్ని మృతుడి తల్లి శేషారత్నం ఆదివారం మీడియాకు వెల్లడించారు. ‘మా బాబు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. అక్కడ పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకునేటప్పుడు ఎవ్వరికీ ఏదీ సంబంధం లేదనే విషయాన్ని చెప్పాను. కన్నబాబుకు, కల్యాణ్‌కు నా కుమారుడి ఆత్మహత్యలో ప్రమేయం లేదు.

బాబు చనిపోవడంతో పొలం మేటర్‌లో ఏదో గొడవ ఉండి ఉంటుందని వాళ్లు వీళ్లు అనడంతో డిప్రెషన్‌లో మాట్లాడాను. పొలం విషయంలో డిప్రెస్‌ అయ్యి, ఆర్థిక కారణాలతో సెన్సిటివ్‌గా ఉన్నాడు. అందువల్లే పురుగు మందు తాగాడు. మధ్యలో కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. దయచేసి ఈ సంఘటనను రాజకీయానికి వాడుకోవద్దు’ అని శేషారత్నం వేడుకొన్నారు.

మరిన్ని వార్తలు