చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు వెల్లంపల్లి సవాల్

26 Nov, 2023 11:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆర్య వైశ్యులకు తానేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆఫీస్‌కు రమ్మన్నా వచ్చేందుకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్య వైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

‘‘చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కార్తీక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా కార్యక్రమం తలపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులు’’ అని వెల్లంపల్లి మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు. విజయవాడ పశ్చిమ టిక్కెట్  వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్‌కి ఉందా?. పోతిన మహేష్‌ సిగ్గు లేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
చదవండి: ఇవిగో నవరత్నాల వెలుగులు

మరిన్ని వార్తలు