‘కారు’ వెళ్లింది.. సర్వీసింగ్‌కే..

13 Jan, 2024 03:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి 

పార్టీలో సంస్థాగత లోపాలు, నేతలకు గుర్తింపు దక్కకపోవడానికి నాదే బాధ్యత 

భువనగిరి బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు ఓటమి కొత్తకాదని, ఈ ఓటమి కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదేనని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు విరామమెరుగకుండా పనిచేసిన కారు మరింత స్పీడ్‌గా పనిచేసేందుకు సరీ్వసింగ్‌కు మాత్రమే పోయిందని, షెడ్డులోకి పోలేదంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదనీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

పార్టీలో సంస్థాగత నిర్మా­ణం జరగలేదని, ఇతర పార్టీల నుంచి వ న వారి­కి సరైన గుర్తింపును ఇవ్వలేకపోయామనీ, అందుకు కూడా తనదే పూర్తి బాధ్యతన్నారు. పది రోజులుగా జరుగుతున్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా జరిగిన సమీక్షల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా గుర్తించిన కారణాలను కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌ బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

ఓటరుకు, కార్యకర్తకు మధ్య లింకు తెగింది 
‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆరి్ధక పరిస్థితిని కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పథకాలకు నడుమ కార్యకర్తల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే ప్రయోజనం చేకూరడంతో ఓటరుకు, కార్యకర్తకు నడుమ లింకు తెగిందని పలువురు నేతలు చెప్పారు. ‘ఆరు లక్షలకు పైగా రేషన్‌ కార్డులు ఇచ్చి నా, ప్రతీ నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేక పోయాం. వందలో ఒకరికి రేషన్‌కార్డు రాకు­న్నా నెగెటివ్‌ ప్రచారం జరిగింది.

దళితబంధు కొందరికే రావడంతో అర్హత కలిగిన ఇతరులు అసహ­నంతో పార్టీకి వ్యతిరేకమయ్యారు. దళితబంధు ఇవ్వడంపై ఇతర కులాల్లో వ్యతిరేకత ఏర్పడింది’ అని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. ‘రైతుబంధు అందరికీ వర్తింప చేసినా ఎక్కువ విస్తీర్ణం కలిగి­న భూస్వాములకు లబ్ధి జరగడాన్ని సామాన్య రైతు ఒప్పుకోలేదని తేలింది. పార్టీ పట్ల ప్రజల్ల నెలకొన్న వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే అధికారానికి దూరమైనట్లు విశ్లేషణలో తేలింది’ అని కేటీఆర్‌ వెల్లడించారు. సమీక్షల్లో భాగంగా వస్తున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధి­నేత కేసీఆర్‌కు నివేదిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 

ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు 
బీఆర్‌ఎస్‌ను ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారంటూ అక్కడక్కడా పార్టీ నాయకులు అంటున్నా­రు. రెండు పర్యాయాలు మనల్ని గెలిపించింది ప్రజ­లే. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’అని కేటీఆ­ర్‌ పార్టీ నేతలకు హితవు పలికారు. ’’సంయమనం పాటించాలని కేసీఆర్‌ సూచించినా కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ను రెచ్చగొట్టి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ వేదికగా మన నేతలు కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టా­రు. స్వయంగా కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎ­లా ఉంటుందో ఊహించలేరు.ఆర్టీసీలో ఉచిత ప్ర­యా­­ణంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికు­లు, న­ష­­్టపోతున్న ఆటో డ్రైవర్ల సమస్యకు ప్రభు­త్వం పరిష్కారం చూపించాలి.’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు 
‘‘బీజేపీతో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నడూ పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్‌ బీజేపీ కుమ్మకై బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయి. కాంగ్రెస్‌ బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్‌ ఇచ్చారు. అమిత్‌ షాతో రేవంత్‌ భేటీ తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ పద్ధతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా నిరాశ తప్పలేదు. రాజకీయం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోంది. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచే వాళ్లమేమో. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటూ తప్పుడు కేసులు ఎదుర్కొంటాం’ అని కేటీఆర్‌ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు