నకిలీ మందుల సమాచారం ఇవ్వండి | Sakshi
Sakshi News home page

నకిలీ మందుల సమాచారం ఇవ్వండి

Published Sat, Jan 13 2024 2:38 AM

VB Kamalasan Reddy: Give information about fake medicines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్‌ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్‌లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. 

అనుమానం వచ్చినా ఫోన్‌ చేయండి 
నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ లేదా అసిస్టెంట్‌ డైరెక్టర్, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్‌సైట్‌ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్‌’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్‌ షాపు ల్లో డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్‌ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్‌’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement