అమరులకే ఇవ్వలేదు.. పంజాబ్‌ రైతులకిస్తారా? 

22 Nov, 2021 02:59 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ట్వీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో, వారిని గుర్తించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘టీఆర్‌ఎస్‌ పాలనలో 7,500 మంది రైతులు చనిపోయారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడింది. అనధికారిక లెక్కల ప్రకారం 40వేల మంది చనిపోయారు.

వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరదబాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు పంజాబ్‌లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.3లక్షలిస్తామని చెపుతున్న కేసీఆర్‌ను ఎలా నమ్మాలి?’’అని తన ట్వీట్‌లో రేవంత్‌ ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు