కేసీఆర్‌ గెలుస్తారు.. లేదు వాళ్లదే విజయం.. చేతులు మారుతున్న కోట్ల డబ్బు!

1 Dec, 2023 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్‌ సైతం ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు మాత్రమ ఎగ్జిట్‌పోల్స్‌ ఫైనల్‌ కాదు.. విజయం తమదంటే తమదే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్‌ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖచ్చితంగా హ్యాట్రిక్‌ కొడుతుందని కొందరు.. లేదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని మరికొందరు జోరుగా పందాలు కాస్తున్నారు. వందల కోట్లతో తెలంగాణ ఫలితాలపై పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నట్టు సమాచారం.. 

మరోవైపు.. రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ముఖ్యంగా గజ్వేల్‌లో ఎంత మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్‌ రాయుళ్లు బెట్టింగ్‌ ఖాస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సిద్దిపేటలో ఈసారి మంత్రికి హారీశ్‌‌ రావుకి గతం కంటే ఎక్కువ వస్తుందా? లేదా తగ్గుతుందా అంటూ బెట్టింగ్‌ జరుగుతోంది. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోతారా? లేదా గెలుస్తారా? అని కూడా తెలంగాణ, ఏపీలో భారీగా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మ​ంలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుందంటూ మరో బెట్టింగ్‌ నడుస్తోంది. అలాగే, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఏయే స్థానాల్లో గెలుస్తుందని కోట్లలో బెట్టింగ్‌ నడుస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

మరిన్ని వార్తలు