Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

27 Jun, 2022 16:36 IST|Sakshi

1. షిండే వర్గానికి ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
సుప్రీంకో​ర్టులో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పైసా ఇవ్వని వాళ్లు.. ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్‌
పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మూడవ విడత అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. బీజేపీ నేతలకు సవాల్‌ విసిరిన మంత్రి కేటీఆర్‌
కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్న బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తోంది ఎంత.. కేంద్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎంత అన్న దానిపై కమలం పెద్దలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రెబల్స్‌ మంత్రులకు షాక్‌.. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సంచలన నిర్ణయం!
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. తొలుత డిమాండ్‌ చేసి.. ఆ తర్వాత ప్లేట్‌ ఫిరాయించి
కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జత చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంలో ఏర్పడిన సందిగ్ద పరిస్థితి తొలగిపోయిందని అనుకోవచ్చు. దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు కూడా వివాదం అవుతుందని ఎవరూ ఊహించలేరు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి!
టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్‌మ్యాన్‌పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌లో
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి మూవీతో అల్లు వారి వారసుడిగా పరిచయమైన బన్నీ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి వంటి చిత్రాలతో స్టార్‌ హీరోగా గుర్తింపు పొందాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. రాష్ట్రపతి రేసులో మీరెందుకు లేరు? సుధామూర్తి ఆసక్తికర సమాధానం
ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చడంలో ఇతోధికంగా తోడ్పడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ ఒకటి. నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్‌ దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతోంది. ఇన్ఫోసిస్‌ ఎదుగుదల వెనుక ఫౌండర్‌ నారాయణమూర్తి శ్రమతోతో పాటు ఆయన భార్య సుధామూర్తి సహకారం కూడా ఉంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ చురుగ్గా ఉండే సుధా నారాయణమూర్తికి ఆడియన్స్‌ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్‌, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!|
పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి
వంట విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన బాదల్‌ తమాంగ్‌(29), సకిల మిశ్ర మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మణికొండ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు