కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం: కేంద్రమంత్రి అశ్విని చౌబే

9 Nov, 2023 17:34 IST|Sakshi

సాక్షి, హన్మకొండ జిల్లా: లిక్కర్‌ కేసులో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తామంటూ కేంద్రమంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యానించారు. హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రూ.వంద కోట్లు గోవా ఎన్నికల్లో ఆప్‌ పార్టీకి కవిత ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. రెండూ ఒకటే. బీజేపీని ఎదుర్కొలేక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఏకమయ్యాయి. తెలంగాణలో కమలం వికసిస్తుందని నా నమ్మకం​’’ అని అశ్విని చౌబే  ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు