బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల

23 Aug, 2022 06:03 IST|Sakshi

అమరచింత/ధరూర్‌: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నా నని చెప్పుకొంటున్న సీఎం కేసీఆర్‌ బీర్ల తెలంగాణగా మారుస్తున్నారని, మద్యం ధరలు పెంచడం, గ్రా మాల్లో బెల్టుషాపులకు అనుమతులి వ్వడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా అమరచింత మండలం, జోగు ళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గుడి, బడి కన్నా వైన్‌షాపులే మిన్న అన్న నినాదాన్ని బలపరుస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకే వైఎస్సార్‌టీపీ స్థాపించానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీఇచ్చారు.  

మరిన్ని వార్తలు