దండుపాళ్యం ముఠా నాయకుడు లోకేష్‌: ఎమ్మెల్యే టీజేఆర్‌

2 Dec, 2023 14:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ భాషని బట్టి అతని స్థాయిని గుర్తించవచ్చని.. తండ్రిని అరెస్టు చేయగానే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ నియోజకవర్గం వెళ్తే ఆ ఎమ్మెల్యేని, కుటుంబ సభ్యులను దూషించటం కరెక్టు కాదన్నారు.

లోకేష్ పాదయాత్ర చేసినా, దాక్కునేయాత్ర, పాక్కునేయాత్ర చేసినా మాకు అభ్యంతరం లేదు. జ్ఞానం లేని వ్యక్తి లోకేష్.  ఏ ఎన్నికలలోనూ గెలవని లోకేష్ కూడా మాట్లాడటం‌ సిగ్గుచేటు. దండుపాళ్యం ముఠా నాయకుడు లోకేష్‌. రైతులకు గిట్టుబాటు ధరల్లేక రోడ్డున పడితే పట్టించుకోనిది నీ తండ్రే. భూములను లాక్కున్న దుర్మార్గులు మీరు. వ్యవసాయం దండుగ అన్నది చంద్రబాబు. రుణాల మాఫీ అని చెప్పి రైతులను నిలువునా మోసం చేశారు. అసలు లోకేష్ బతుకెంత? అతని స్థాయి ఎంత?’’ అంటూ సుధాకర్‌బాబు దుయ్యబట్టారు.

‘‘ఆర్బీకేలను తెచ్చి రైతులకు అండగా నిలిచింది సీఎం జగన్. మీ నాన్న హయాంలో ఆ పరిస్థితి ఉందా?. మా‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రజలకు మేలు చేస్తున్నందునే ఓట్లు అడుగుతాం. మరి చంద్రబాబు ఏం చెప్పుకుని ఓట్లు అడుగుతారు?. ఇసుకదొంగ చింతమనేని ప్రభాకర్, పోలవరం దోపిడీ దారుడు ఉమా.. ఇలాంటి వాళ్లు కూడా మాపై మాట్లాడతారా?. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకోలేక లోకేష్‌ బూతులు మాట్లాడుతున్నాడు. దోపిడీ చేసి జైలుకు వెళ్లి వచ్చిన దొంగ చంద్రబాబు. జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం అమలవుతోంది’’ అని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు.
చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌ ఎంత? 

మరిన్ని వార్తలు