మండపేటలో ‘సామాజిక’ హోరు

22 Dec, 2023 18:49 IST|Sakshi

మండపేట: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన సామాజిక సాధికార

 బస్సుయాత్ర బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. మండపేట కలువ పువ్వు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరై సామాజిక సాధికార యాత్రకు సంఘీభావం తెలిపింది. మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. 

తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘2019లో మండపేట నియోజకవర్గం ప్రజలు చేసిన తప్పు మళ్ళీ చేయరు. జగనన్న పాలను చూసి 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. చంద్రబాబు ఇచ్చే భరోసా ఆయన తనయుడికి మాత్రమే.. ప్రజలకు కాదు. మరోసారి చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్‌ చేసింది పాదయాత్ర.. లోకేష్‌ చేసింది జాగింగ్‌ మాత్రమే. రాష్ట్రంలో మరోసారి వైఎస్‌ జగన్‌ పాలన రావాలి’ అని పేర్కొన్నారు.

ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ‘ఏడాదికి 16 వేల కోట్ల లోటు ఆదాయం ఉన్న రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి మారే సమయంలో తక్షణం తీర్చాల్సిన అప్పులు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మన రాష్ట్రంలో టిడిపి తక్షణం తీర్చాల్సిన 80 వేల కోట్ల రూపాయలు అప్పు మిగిల్చింది.కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది సీఎం జగన్ కాదా?, రాష్ట్రంలో నూటికి 78 మంది పేదవాళ్లే ....వాళ్లని ఆదుకునే  ప్రయత్నమే సీఎం జగన్ చేస్తున్నారు. సరైన న్యాయం మీరే చెప్పండి.ఒకే కులం అనేక సంవత్సరాలు పాటు మండపేటను పాలిస్తోంది. గతంలో ఒకసారి మార్చమని అడిగాం... ప్రజలు మార్చారు.22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో  ఇప్పటివరకు 20 లక్షల మందికి ఇళ్ళ పటాలిస్తే... ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాల సీఎం జగన్ ఇవ్వటం దేశ చరిత్రలోనే ఒక  రికార్డు. ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన  వారిని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో నిలిపిన ఘనత వైఎస్ఆర్ సీపీదే’ అని స్పష్టం చేశారు.

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ..  ‘ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం.జగనన్న కటౌట్ చూసే జనం వస్తున్నారు. చంద్రబాబుకు లోకేష్‌కి కూడా పనిలేదు.చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ ,రాధాకృష్ణ, హైదరాబాదులో ఉండి  ఆంధ్రాలో విషం చిమ్ముతారు.అధికారంలోకి  వస్తే చంద్రబాబు మొత్తం ప్రభుత్వ పథకాలను తీసేస్తారంట.బాబుకి గ్యారెంటీ ఉందా?, లోకేష్ పాదయాత్ర చేశాడా.... ఎవరైనా చూశారా...?, పాదయాత్ర అంటే వైఎస్ఆర్ చేయాలి... లేదంటే వైఎస్‌ జగన్‌ చేయాలి.

యువగళం సభలో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిని లోకేష్ చెప్పినా.... పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా స్టేజ్పైన కూర్చున్నాడు.నేను వంగవీటి మోహనరంగా అభిమానిని.టిడిపికి ఓటు వేస్తే వంగవీటికి ద్రోహం చేసినట్టే.25 మంది మంత్రులుంటే 17మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఉన్నారు ఇదీ సామాజిక సాధికారత. సామాజిక సాధికారత పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. మండపేటలో జరిగే యుద్ధం పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగుతుంది.చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్కచెల్లెలను మోసం చేశారు.. రైతులు మోసం చేశారు’ అని ప్రజలకు స్పష్టం చేశారు.

 ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ..‘ప్రభుత్వం అంటే భూస్వామి కాదు... పెట్టుబడిదారుడు కాదు... ప్రభుత్వం అంటే ప్రజలదే... అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. రాష్ట్రంలో 72% బీసీలకు, 52 శాతం మహిళలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నేలను గెలవగలరేమో తప్ప ప్రజలను జయించలేరు.పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి ప్రయత్నించిన సీఎం జగన్‌ను ఆపేందుకు ప్రతిపక్షాలు ఎంతో  ప్రయత్నించాయి.నేర్పితే తెలుగు చచ్చిపోతుందని రామోజీరావు అన్నాడు.

సీఎం జగన్‌ ధైర్యం, సాహసం ముందు ప్రతిపక్షాలు నిలబడలేవు. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తన కులాన్ని మాత్రమే ప్రోత్సహించాడు.ఆయన ప్రోత్సహించిన ఈనాడు ఎన్టీఆర్‌ను ఎత్తేసి మళ్లీ నేలపై పడేసింది. పేదవాడికి జగన్ అన్నం పెట్టారు... అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం మరొకటి లేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అప్పు 176 లక్షల కోట్లు. దమ్మున్న జగనన్నను చూసి పర్వతంలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా గజగజ వణికింది.పవన్ కళ్యాణ్.... ఈ రాష్ట్రం ప్రయోగశాల కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు వారి వెనకాల వచ్చే బిసిలు మళ్ళీ జగనన్ననే నాయకుడిగా ఎన్నుకుంటారు’ అని పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ..  ‘రానున్న కాలంలో కాపు, బీసీ సామాజిక వర్గాలు కలిసి జగనన్న విజయానికి తోడ్పడాలి. 70 ఏళ్లుగా పార్లమెంటు ఆమోదించని మహిళా బిల్లును తనకున్న ఎంపీలతో ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి సీఎం జగన్.రాష్ట్రంలో ఓ బీసీ రిజర్వేషన్ ఉండాలని కోరుకున్న వ్యక్తి సీఎం జగన్.ప్రజలతో మమేకమైన తోట త్రిమూర్తులను మండపేటలో  కచ్చితంగా గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.. ‘ ప్రజలందరూ సామాజికంగా ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం జగన్ ఆలోచన. పార్లమెంట్‌లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టారు కానీ సీఎం జగన్‌ 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు