‘సామాజిక సాధికారితను అమలు చేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్‌’

24 Nov, 2023 18:11 IST|Sakshi

జగ్గయ్యపేట(ఎన్టీఆర్ జిల్లా):  వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత యాత్రలో భాగంగా 20వ రోజు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు.  ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలోని బలుసుపాడు నాలుగురోడ్ల కూడలిలోజరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సభలో ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్‌, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్‌రావు, వసంత కృష్ణప్రసాద్‌, కొక్కిలిగడ్డ రక్షణనిధి, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, రాష్ట్ర  వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌ భాషా తదితరులు హాజరయ్యారు.

ఖాదర్‌బాషా మాట్లాడుతూ..  ‘వైఎస్సార్‌సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ. చంద్రబాబుకు ఆయన సామాజికవర్గమే కనిపిస్తుంది. చంద్రబాబు జైలుకు పోతే కేసులకు భయపడి ఢిల్లీకి పారిపోయిన దద్దమ్మ లోకేష్‌. మరో దద్దమ్మ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోయాడు. ఒరేయ్ లోకేష్ నీకు జగన్ మోహన్ రెడ్డి ఎవరో తెలియదా?, చంద్రబాబు ఒక్క మహిళకైనా మహాలక్ష్మి పథకం ఇచ్చాడా?, మహిళలకు అమ్మ ఒడి పథకం ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. మేనిఫెస్టోను మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రెండు పేజీల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించి అమలు చేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమానికి చంద్రబాబు రెండువేల కోట్లిస్తే.. సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లలో 24 వేల కోట్లు ఇచ్చాడు. మా నమ్మకం నువ్వే జగనన్న. హజ్‌యాత్రకు వెళ్లే వారి పై భారం పడకుండా రూ. 15 కోట్లు ఇచ్చారు. 4% రిజర్వేషన్లు ఇచ్చి మా మనసులో వైఎస్సార్ నిలిచిపోయారు.వక్ఫ్ బోర్డును రక్షిస్తానని చెప్పారు.. రక్షించారు. మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్‌’ అని స్పష్టం చేశారు.

నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు  మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికే పరిమితమైంది. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి.సామాజిక సాధికారతను అమలు చేసిన నేతలు వైఎస్సార్, జగన్‌లు. ఆర్ధికంగా,సామాజికంగా,రాజకీయంగా అన్ని రంగాల్లో సాధికారతను ఇచ్చిన ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. డబ్బున్నోళ్లకే చదువులనే విధానాన్ని మార్చిన గొప్ప నేత జగన్ మోహన్ రెడ్డి. స్కూల్స్ ,విద్య,వైద్యంలో మార్పులు తెచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. సాయం కోసం ఒకరి వద్ద తల వంచుకునే అవసరం లేకుండా చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే సాధికారత. ఆ సాధికారత ఇచ్చిన ఒకే ఒక్కడు సీఎం జగన్‌,.పేదలు,బడుగు,బలహీన వర్గాలు,రైతులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారని విమర్శించిన వాళ్లు జగన్ కంటే ఎక్కువిస్తామంటున్నారు .25 ఇళ్లకే వాలంటీర్లను పెడతామంటున్నారు. సీఎం జగన్‌ దేశానికి దిక్సూచి’ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా అంబేద్కర్,పూలే ,జగ్జీవన్ రామ్ విగ్రహాలు కనిపిస్తాయి. వీరంతా మన హక్కుల కోసం కలలు కన్న గొప్ప వ్యక్తులు.అంబేద్కర్,పూలే ,జగ్జీవన్ రామ్ ల ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం జగన్‌ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. బీసీ, ఎస్సీలను మంత్రులను చేసిన మగాడు సీఎం జగన్‌. కేవలం కమ్మ సామాజిక వర్గం నేతలే కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్లుగా పని చేసేవారు. ఒక బీసీ మహిళను కృష్ణా జడ్పీ చైర్‌ పర్సన్‌ చేసిన వ్యక్తి సీఎం జగన్‌

జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత వాస్తవ బడ్జెట్‌ రూ. 8 లక్షల కోట్లు. 4 లక్షల 70 వేల కోట్లు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి’ అని కొనియాడారు.

మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. ‘సంక్షేమ సామాజిక సాధికార సృష్టికర్త జగనన్న. నాలుగున్నరేళ్లుగా సామాజిక సాధికారత సంతోషాన్ని మనం పొందుతున్నాం. బడుగు,బలహీన వర్గాలు జగనన్న పాలనలో తలెత్తుకుని బ్రతుకుతున్నారు. క్యాబినెట్‌లో 17 మందికి మంత్రిగా అవకాశం కల్పించారు .ప్రతీ పదవుల్లోనూ 50% శాతం మనకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది నోట్లు కాదు...గౌరవం. ఆ గౌరవాన్ని నిలబడేలా చేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. కార్పొరేట్ వైద్యం మన ఇంటికే వస్తుంది.. కార్పోరేట్‌ విద్య మన ఊరిలోనే అందుతోంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు