కొడుకు దుబాయ్‌లో..

9 Nov, 2023 00:26 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతుడు ప్రకాశ్‌రావు రక్తం మరకల బట్టలు
● అనారోగ్యంతో ఉన్న భర్తను కడతేర్చిన భార్య, కూతురు ● ఫలించని శవాన్ని మాయం చేసే ప్రయత్నాలు ● మృతుని బట్టలే ప్రధాన ఆధారం ● దుర్వాసనతో దొరికిపోయారు ● పరారీలో మరో ఇద్దరు ● సంచలనం ప్రకాశ్‌రావు హత్యోదంతం

గల్ఫ్‌ బాటలో అలసిపోయి..

సిరిసిల్లలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉండే ప్రకాశ్‌రావు కుటుంబ పోషణకు గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. ప్రకాశ్‌రావు పంపిన డబ్బులతో జిల్లా కేంద్రంలోని శివనగర్‌లో ఇంటిని కొనుగోలు చే శారు. దాదాపు 15 ఏళ్లపాటు గల్ఫ్‌లో పనిచేసిన ప్రకాశ్‌రావు ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇంటికొచ్చాడు. చేతికందిన కొడుకును గల్ఫ్‌ దేశానికి పంపించాడు. పక్షవాతంతో బాధపడుతూ భార్య,కూతురుతో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు.

అడ్డుతొలగించాలని..

ప్రకాశ్‌రావు గల్ఫ్‌లో ఉండగానే అతని భార్య స్వప్న(42)కు ఓ వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతని వద్ద భారీగా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఆమె చర్యలతో అప్పులపాలైన సదరు వ్యక్తి శివనగర్‌లోని ఇల్లును అమ్ముకుని హైదరాబాద్‌కు పరారయ్యాడు. మంచంపట్టిన ప్రకాశ్‌రావుతో స్వప్న తరచూ గొడవపడేది. ఆమె ప్రవర్తనను తప్పుపట్టడంతో అడ్డుతొలగించుకో వాలని భావించింది. నవంబరు 1న అర్ధరాత్రి నిద్రలో ఉన్న ప్రకాశ్‌రావు మెడను కూరగాయల కత్తితో కోయగా.. కూతురు ఉషశ్రీ(18) దిండుతో ఒత్తిపట్టింది. శవాన్ని గొడ్డలితో ముక్కలు చేయాలనుకోగా.. సాధ్యం కాలేదు. మరుసటి రోజు మటన్‌ కొట్టే కత్తిని కొనుగోలు చేసి ముక్కలు చేయాలని ప్రయత్నించగా వీలుకాలేదు. పెట్రోల్‌తో కాల్చివేయాలని రెండు సార్లు నిప్పు అంటించారు. మంటలు భారీగా రావడంతో చల్లార్చారు. చివరికి ఇంట్లోనే గొయ్యి తీసి శవాన్ని పూడ్చిపెట్టారు. రెండు రోజులపాటు శవంతో సహవాసం చేశారు.

గతంలోనూ జైలుకెళ్లిన స్వప్న

గతంలో సమీప బంధువు హత్య కేసులో స్వప్న జైలుకెళ్లింది. నిత్యం తెల్లవారుజామునే గుడికెళ్లి పూజలు చేసే అలవాటు ఉన్న స్వప్న ఇలా క్రూ రంగా భర్తను హతమార్చడం స్థానికంగా చర్చనీయాంశమైంది. హత్య జరిగిన ఇంటిని కూడా ఓ వ్యాపారికి ఇటీవల రూ.38 లక్షలకు అమ్మేసింది. ఇల్లు రిజిస్ట్రేషన్‌ కూడా అయింది. ఆ డబ్బుతో సిరిసిల్ల విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హత్య సమయంలో ప్రకాశ్‌రావు ఒంటిపై ఉన్న బట్టలకు అంటిన రక్తం మరకలు, ఇంట్లో గొయ్యిలో పూడ్చిన చోట ఉన్న మృతుడి రక్తం మ రకలు, మాంసపు ముద్దలే కేసుకు సా క్ష్యంగా మా రాయి. హత్య జరిగినట్లు తెలిసినా.. దాచి ఉంచి, అంత్యక్రియలకు సహకరించిన స్వప్న చిన్నాన్న, అతని భార్య పరారీలో ఉన్నారు. ప్రకాశ్‌రావు హత్యకు గురికాగా.. అతని కొడుకు గల్ఫ్‌లో ఉన్నాడు.. భార్య, కూతురు జైలుకు వెళ్లారు. ఇంటికి తాళం పడింది. సిరిసిల్ల ప్రజలు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. హత్య కేసును వేగంగా చేధించిన సిరిసిల్ల టౌన్‌ పోలీసులు పని తీరు ప్రశంసనీయమైంది.

సిరిసిల్ల: మానవత్వం మంటగలిసింది. అనుబంధాలు అడుగంటాయి. కట్టుకున్న భార్య, కన్న కూతురు కలిసి చేసిన హత్యతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. కొడుకు దుబాయ్‌లో.. హత్యకు పాల్పడ్డ తల్లీకూతుళ్లు జైలుపాలయ్యారు. పాతికేళ్లపాటు కాపురం చేసిన భార్య, కన్నకూతురు కలిసి తండ్రిని హత్య చేయడంతోపాటు శవాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి. ఆలస్యంగా వెలుగుచూసిన హత్యోదంతం సిరిసిల్లలో కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన

వివరాలు ఇలా ఉన్నాయి.

దుర్వాసనతో దొరికిపోయారు..

పాతిపెట్టిన శవం దుర్వాసన ఇల్లంతా వ్యాపించింది. వాకిట్లోకి దుర్వాసన వస్తుండడంతో సమీప బంధువుల సాయంతో అంత్యక్రియలు చేశారు. నిద్రలోనే చనిపోయాడని చుట్టుపక్కల వారికి చెప్పారు. వైకుంఠరథంలో శవాన్ని తీసుకెళ్తుంటే దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే శవం కాలిపోయింది. సిరిసిల్ల టౌన్‌ సీఐ ఉపేందర్‌, పోలీసులు తల్లీకూతుళ్లు స్వప్న, ఉషశ్రీని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్యోదంతం వెలుగుచూసింది.

మరిన్ని వార్తలు