ఎస్పీ రమణకుమార్‌ బదిలీ

12 Oct, 2023 07:38 IST|Sakshi

 సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్పీ ఎం.రమణకుమార్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది నాన్‌క్యాడర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు బదిలీ అయ్యింది. 2021 జూలై 30 ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సుమారు రెండేళ్ల మూడు నెలలపాటు విధులు నిర్వర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు జారీకి ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించింది. కీలకమైన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఈసీ ఉన్నతాధికారులు రాష్ట్రంలో కీలక పదవుల్లో నాన్‌కేడర్‌ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగా ఉన్నతాధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అడిషనల్‌ ఎస్పీ అశోక్‌కు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

మరిన్ని వార్తలు