'పొట్ట పెంచుదాం'.. వైరల్‌గా మారిన రెస్టారెంట్‌

22 Jan, 2021 13:46 IST|Sakshi

కొన్ని రెస్టారెంట్ల పేర్లు భలే వెరైటీగా ఉంటాయి. దీంతో అక్కడ దొరికే ఫుడ్‌ కంటే రెస్టారెంట్‌ పేరే ఫేమస్‌ అవ్వడం చాలా సందర్భల్లో చూస్తుంటాం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెస్టారెంట్ పేరు  చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌ పేరు 'పొట్ట పెంచుదాం'. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో  ఈ రెస్టారెంట్‌ పేరు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియా పుణ్యమాని ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు బోలెడంత మంది క్యూ కడుతున్నారు.  (ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి )

పేరే అంత వెరైటీగా ఉంటే ఇక  ఫుడ్ ఇంకెంత టేస్టీగా ఉంటుందో అని చాలామంది ఈ రెస్టారెంట్‌కు వెళ్తున్నారట. దీంతో ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే దీనికి మంచి గుర్తింపు లభించింది. తిండి తగ్గించి పొట్ట తగ్గించుదామనుకుంటే ఇదెక్కడి రెస్టారెంట్‌ రా బాబూ అని కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వెరైటీ రెస్టారెంట్లు బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. తినేసి పో, ఉప్పు కారం, దిబ్బ రొట్టె, అద్భుతః, కోడి కూర చిట్టి గారే, దా తిను, అమ్మ ముద్ద, పచ్చిపులుసు లాంటి పేర్లు జనాలను ఆకట్టుకున్నాయి. (ఇలాంటి ఫ్యామిలీ నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌!)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు