Inzamam Ul Haq: 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే! పవర్‌ఫుల్‌ సిక్సర్‌.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది! వీడియో

21 Dec, 2022 16:53 IST|Sakshi
ఇంజామ్‌ ఉల్‌ హక్‌ పవర్‌ఫుల్‌ సిక్సర్‌(PC: Mega Stars League)

Inzamam Ul Haq- Shahid Afridi: విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికి 15 ఏళ్లకు పైనే అవుతోంది. జింబాబ్వేతో 2007లో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా పాక్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు ఇంజీ! అయితే, యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిమానులను అలరిస్తున్న ఈ మాజీ సారథి... తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు.

అదిరిపోయే షాట్‌
పాకిస్తాన్‌లో మెగా స్టార్స్‌ లీగ్‌ పేరిట ఆరు జట్ల మధ్య టీ10 లీగ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగిన ఇంజమామ్‌.. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, క్రీజులో ఉన్నంత సేపు బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు ఇంజీ. ఈ క్రమంలో అతడు కొట్టిన పవర్‌ఫుల్‌ సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది.

52 ఏళ్ల వయసులోనూ పవర్‌హిట్టింగ్‌ చేసిన ఇంజీని అలా చూస్తూ ఉండిపోయారు అభిమానులు. డగౌట్‌లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్‌ షాట్‌కు ఆశ్చర్యపోయాడు. సోమవారం నాటి మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

పరుగుల వరద
కాగా పాకిస్తాన్‌ తరఫున ఇంజమామ్‌ వన్డేల్లో మొత్తంగా 11,701 పరుగులు సాధించాడు. పాక్‌ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో మొత్తంగా 120 టెస్టులు, 378 వన్డేలు ఆడాడు. 81 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించి 51 గెలిచాడు.

చదవండి: Ajinkya Rahane: డబుల్‌ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ..
Babar Azam: ఒక్క మాటతో రమీజ్‌ రాజా నోరు మూయించిన బాబర్‌! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ..

మరిన్ని వార్తలు