కెప్టెన్‌గా పంత్‌.. కోహ్లి, రోహిత్‌లకు దక్కని చోటు

11 May, 2021 17:52 IST|Sakshi

ముంబై: మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ఐపీఎల్ 2021 సీజన్ ప్లెయింగ్‌ ఎలెవెన్‌ జట్టులో ఎంఎస్‌ ధోని,విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఆకాశ్ చోప్రా ఈ జట్టుని ఎంపిక చేశాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను ఎంపిక చేశాడు. మూడో స్థానంలో డుప్లెసిస్‌.. ఇక మిడిలార్డర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, క్రిస్ మోరిస్‌లను సెలెక్ట్‌ చేసిన చోప్రా.. మరో స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ని తీసుకున్నాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్‌కి చోటిచ్చాడు.

ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌, ఢిల్లీ, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో ఆటగాళ్లతో పాటు సిబ్బంది కరోనా బారిన పడడంతో లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా లీగ్‌లో 29 మ్యాచ్‌లు ముగియగా.. మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ఐపీఎల్ 2021 ప్లేయింగ్ ఎలెవన్:  రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్, రాహుల్ చాహర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్
చదవండి: 'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు'

ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు