ఏబీడీ మెరుపులు

21 Sep, 2020 21:25 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభంలో దేవదూత్‌ దూకుడుకు తోడు చివర్లో ఏబీ డివిలియర్స్‌ మెరుపులు తోడు కావడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగుకోసం యత్నించే క్రమంలో డివిలియర్స్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. మనీష్‌ పాండే వేసిన అద్భుతమైన త్రోను బెయిర్‌స్టో ఎటువంటి వృథా చేయకుండా ఏబీడీని రనౌట్‌ చేశాడు. దాంతో డివిలియర్స్‌ మరికొన్ని మెరుపుల్ని ఆర్సీబీ అభిమానులు మిస్సయ్యారు. (చదవండి: ఖతర్నాక్‌ కుర్రాడు.. పడిక్కల్‌)

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో  ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది .ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్‌ దాటిగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్‌ మాత్రం కాస్త  నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్‌ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫించ్‌ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. పడిక్కల్‌ను విజయ్‌శంకర్‌ బౌల్డ్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫించ్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లి(14) నిరాశపరచాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి రషీద్‌ ఖాన్‌కు దొరికిపోయాడు. దూబే(7) ఆట మరీ పేలవంగా సాగింది. దాంతో ఆర్సీబీ నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ వర్మ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు