పవర్‌ఫుల్‌ షాట్‌.. కెమెరానే పగిలిపోయింది!

4 Apr, 2021 19:54 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌-14వ సీజన్‌ ఇంకా మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు.  భారీ షాట్లు, హిట్టింగ్‌తో ప్రాక్టీస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న బెన్‌ స్టోక్స్‌ ఆ జట్టుకు కీలక ప్లేయర్‌గా మారవచ్చు. 2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బెన్‌ స్టోక్స్‌ ఆ సీజన్‌ మినహా మిగతా సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేదు. 

2017లో 316 పరుగులు, 12 వికెట్లతో ఆకట్టుకున్నాడు స్టోక్స్‌. ఆ తర్వాత మూడొందల పరుగుల స్కోరును, 10 వికెట్ల మార్కును స్టోక్స్‌ దాటలేదు. కాగా, ఇటీవల కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న స్టోక్స్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. స్టోక్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది రాజస్తాన్‌ రాయల్స్‌. కాగా, స్టోక్స్‌ చేసిన తాజా ప్రాక్టీస్‌లో ఒక కెమెరా పగిలిపోయింది. వరుసగా భారీ షాట్లతో కొడుతూ పోయిన స్టోక్స్‌.. ఒక షాట్‌ను అదే స్థాయిలో స్టయిట్‌ డ్రైవ్‌ ఆడాడు.

దాని దెబ్బకు ఎదురుగా ఉన్న కెమెరా ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఐదు నెలల తర్వాత స్టోక్స్‌ రాయల్‌గా జట్టులో చేరాడు అని క్యాప్షన్‌ ఇచ్చింది. స్టోక్స్‌ భారీ షాట్ల ప్రాక్టీస్‌పై సహచర ఆటగాడు తెవాటియా ప్రశంసించాడు. ‘సూపర్బ్‌ ఫామ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. దానికి స్టోక్స్‌ బదులిస్తూ.. ‘ ట్రైయినింగ్‌ బాగుంది. ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్‌కు కుదరలేదు. ఇక్కడ రోజూ ప్రాక్టీస్‌తోనే గడవడం నాకు ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. 

ఇక్కడ చదవండి: మెరుపులాంటి ఫీట్‌లు.. మతిపోయే క్యాచ్‌లు

ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే

మరిన్ని వార్తలు