జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి

22 Nov, 2023 07:23 IST|Sakshi

వచ్చే నెలలో స్పెయిన్‌లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్‌ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది.

34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్‌ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్‌తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్‌ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్‌ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పోటీపడుతుంది. 

మరిన్ని వార్తలు