‘కింగ్‌’ అర్జున్‌

20 Nov, 2021 05:04 IST|Sakshi

టాటా స్టీల్‌ ఇండియా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గిన తెలంగాణ ప్లేయర్‌

కోల్‌కతా: పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఎరిగైసి అర్జున్‌ అద్భుతం చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రోజు జరిగిన మూడు గేమ్‌లను అర్జున్‌ ‘డ్రా’గా ముగించాడు. ఆధిబన్‌ (భారత్‌)తో జరిగిన ఏడో గేమ్‌ను అర్జున్‌ 45 ఎత్తుల్లో... విదిత్‌ (భారత్‌)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 12 ఎత్తుల్లో... లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు