T20 WC 2022: ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలిస్తే, బాబర్‌ ఆజమ్‌ ప్రధాని అవడం ఖాయం..!

12 Nov, 2022 09:13 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌ దాకా చేరిన పాకిస్తాన్‌.. రేపు (నవంబర్‌ 13) జరుగబోయే టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్‌, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌.. పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రేపు జరుగబోయే ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలిస్తే, కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. 2048లో పాక్‌ ప్రధాని అవడం ఖాయమని జోస్యం చెప్పాడు.

1992 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌ విజయం, ఆతర్వాత జరిగిన పరిణామాల్లో నాటి పాక్‌ సారధి ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ పార్టీ (పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్) పెట్టడం (1996), ఆతర్వాత 22 ఏళ్లకు (2018) ఇమ్రాన్‌ పాక్‌ ప్రధాని కావడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని లిటిల్‌ మాస్టర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 1992 వరల్డ్‌కప్‌లో కూడా పాక్‌ ప్రస్తానం అచ్చం ఇలాగే సాగడంతో గవాస్కర్‌ ఈ తరహా వాఖ్యలు చేశాడు.

సన్నీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. గవాస్కర్‌ నోటి మాట పుణ్యమా అని తమ ఆరాధ్య క్రికెటర్‌ పాక్‌ ప్రధాని కావాలని బాబర్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

►1992 వన్డే వరల్డ్‌కప్‌, 2022 టీ20 వరల్డ్‌కప్‌లలో పాక్‌ ప్రస్తానం..

1992 వన్డే వరల్డ్‌కప్‌: అప్పటి వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యం
2022 టీ20 వరల్డ్‌కప్: ఇప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యం

1992: మెల్‌బోర్న్‌ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి
2022:  అదే మెల్‌బోర్న్‌లో టీమిండియా చేతిలోనే ఓటమి

1992: ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు
2022: నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపు

1992: లీగ్‌ దశలో చివరి రోజు ఒక్క పాయింట్‌ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్‌ సెమీస్‌కు అర్హత
2022: తాజాగా సూపర్‌-12 దశలో నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడడం.. బంగ్లాదేశ్‌పై పాక్‌ గెలవడం.. దీంతో ఒక్క పాయింట్‌ ఆధిక్యంతో సెమీస్‌కు అర్హత

1992: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు
2022: సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన పాక్‌ ఫైనల్‌కు

1992: ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన పాకిస్తాన్‌
2022: ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న పాక్‌
చదవండి: PAK Vs ENG: ఇంగ్లండ్‌- పాక్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దు అయితే?
 

Poll
Loading...
మరిన్ని వార్తలు