Ashes 2021-22: "ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. రూట్‌ వద్దే వద్దు"

23 Dec, 2021 09:55 IST|Sakshi

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. ఇక సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌( బ్యాక్సింగ్‌ డే టెస్ట్) డిసెంబర్‌26న మెల్‌బోర్న్‌ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో అయిన గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఆదే విధంగా మరోసారి ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటకీ, సారథిగా జట్టును నడిపించలేక పోతున్నాడాని తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో జో రూట్‌పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కీలక వాఖ్యలు చేశాడు. రూట్‌ టెస్టు కెప్టెన్‌గా పనికిరాడని, అతడి స్ధానంలో బెన్ స్టోక్స్‌కు అవకాశం ఇవ్వాలి అని అతడు అభిప్రాయపడ్డాడు.

 "రెండో టెస్ట్‌ నాలుగో రోజు జో రూట్‌ గైర్హాజరీ నేపథ్యంలో బెన్ స్టోక్స్ బాధ్యతలు స్వీకరించాడు. అతడు ఆ సమయంలో ఫీల్డ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అతడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఫీల్డ్‌ విధానం కూడా చాలా బాగుంది. కేవలం 20 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్‌ బౌలర్లు నాలుగు వికెట్లు పడగొట్టారు. స్టోక్స్‌ తన కెప్టెన్సీతో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టాడు. నా దృష్టిలో రూట్‌ కంటే స్టోక్స్ అత్యత్తుమ కెప్టెన్‌" అని హాడిన్ పేర్కొన్నాడు. డే-నైట్ టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని రూట్‌ చేసిన వాఖ్యలపై హాడిన్ మండిపడ్డాడు. "అతడు కోచ్‌తో పాటు సెలక్షన్ కమిటీలో పాల్గొన్నాడు. అనంతరం సరైన జట్టును ఎంపిక చేశామని రూట్‌, కోచ్‌ ప్రకటించారు. ఇప్పుడు ఇలా బౌలర్లను నిందించడం సరికాదు" అని  హాడిన్ పేర్కొన్నాడు.

చదవండి: న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌పై వేటు..

మరిన్ని వార్తలు