Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!

2 Jun, 2022 11:52 IST|Sakshi

భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన లివింగ్‌స్టోన్‌ సీజన్‌ మొత్తం భారీ సిక్సర్లతో అలరించాడు. తాజాగా అదే టెంపోను టి20 బ్లాస్ట్‌లోనూ కొనసాగిస్తు‍న్నాడు. ఇంగ్లండ్‌ వేదికగ జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో లంకాషైర్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్‌ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.

ఏ మాత్రం జాలీ, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా భారీ సిక్సర్లు బాదుతు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యంత భారీ సిక్స్‌ లివింగ్‌స్టోన్‌ పేరిటే ఉంది. తాజాగా బుధవారం రాత్రి లంకాషైర్‌, డెర్బీషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్‌ కొట్టిన ఒక భారీ సిక్స్‌ స్టేడియం అవతల ఒక బిల్డింగ్‌ కన్‌స్ట్రక‌్షన్‌ చేస్తున్న దగ్గరపడింది. అయితే బంతి ఎక్కడ పడింతో తెలియకపోడంతో ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్క్‌లో ఉన్న బిల్డర్లు కూడా పని ఆపేసి బంతికోసం వెతికారు. చివరకు ఒక గుంత పక్కడ కనిపించడంతో బంతిని అందుకొని గ్రౌండ్‌లోకి విసిరేశారు. అప్పటికే కాచుకు కూర్చొన్న అంపైర్‌ పరిగెత్తుకెళ్లి బాల్‌ను తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్‌ విధ్వంసం దాటికి లంకాషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెర్బీషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌లో లూస్‌ డూ ప్లూయ్‌ 59, లుయిస్‌ రీస్‌ 55 పరుగులు చేశారు.

చదవండి: Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'

T20 Blast 2022: భారీ సిక్సర్‌.. బర్గర్‌ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి

మరిన్ని వార్తలు