Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్‌ భయ్యా ఎక్కడున్నావు!?

19 Dec, 2021 08:16 IST|Sakshi

విరాట్‌ కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌ వర్గాల్లో గత కొద్ది రోజులుగా కోహ్లి కెప్టెన్సీ వివాదంపై పెద్ద చర్చ నడిచింది. టి20ల్లో తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. వన్డేల్లో మాత్రం సెలక్టర్లు అతనికి అవకాశమివ్వకుండానే తొలగిస్తున్నట్లు చెప్పారు. దీంతో కోహ్లి అవమానభారంతో రగిలిపోతున్నాడని.. ఏకంగా పరిమిత, టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతోపాటు రోహిత్‌ కెప్టెన్సీలో కోహ్లి ఆడడానికి ఇష్టపడడం లేదంటూ రూమర్లు వచ్చాయి.

చదవండి: Virat Kohli: కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు.. వాళ్లకేం తెలుసు!

ఇవన్నీ చూసిన కోహ్లి సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు  మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చుకున్నాడు. మీడియా సమావేశంలో కోహ్లి గంగూలీ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.   ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ వివాదం పక్కనబెట్టి ఆటపై దృష్టి పెట్టాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు హితబోధ చేశారు. అయితే అందరు స్పందింస్తున్నప్పటికి ఒక మాజీ క్రికెటర్‌ మాత్రం ఇంతవరకు కోహ్లి కెప్టెన్సీ వివాదంపై స్పందించలేదు. అతనే మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌.. 

వాస్తవానికి సెహ్వాగ్‌ ఏవైనా వివాదాలు చోటుచేసుకుంటే వెంటనే స్పందించే అలవాటు ఉంది. అది ఫన్నీవేలో.. లేక.. విమర్శలు సందింస్తూగానీ.. తన ట్విటర్, యూట్యూబ్‌ చానెల్‌లో సందేశాలివ్వడం చేస్తుండేవాడు. మరి అలాంటి సెహ్వాగ్‌ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడంటూ క్రికెట్‌ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. '' సెహ్వగ్‌ కనిపించడం లేదు.. మీకు ఎక్కడున్నాడో తెలుసా''.. ''  కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై రచ్చ జరుగుతుంటే సెహ్వాగ్‌ ఏం పట్టనట్లు ఉన్నాడు..''.. '' సెహ్వాగ్‌కు ఏమైంది.. '' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. ​కాబట్టి

కాగా సెహ్వాగ్‌ ఈ విషయంలో స్పందించకపోవడంపై ఒక ముఖ్యకారణముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ కోహ్లి గంగూలీ పేరు ప్రస్తావించాడని.. అందుకే సెహ్వాగ్‌ ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎందుకంటే గంగూలీకి, సెహ్వాగ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. సెహ్వాగ్‌ క్రికెట్‌ ఆడుతున్న సమయంలో అత్యంత ఎక్కువగా ప్రోత్సహించింది గంగూలీనే. అతను విధ్వంసకర ఓపెనర్‌గా మారడంలో గంగూలీ కీలకపాత్ర పోషించాడు. ఈ అభిమానంతోనే కోహ్లి కెప్టెన్సీ వివాదంపై గంగూలీకి వ్యతిరేకంగా సెహ్వాగ్‌ వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడడం లేదని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎంతో చలాకీగా ఉండే సెహ్వాగ్‌లో ఆ జోష్‌ కనిపించడం లేదని అభిమానులు వాపోయారు.

చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే'

>
మరిన్ని వార్తలు