T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్‌!?

7 Dec, 2023 18:04 IST|Sakshi
PC: INside sport

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి భాగమయ్యే సూచనలు కన్పించడం లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత  ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్‌ కూడా ఆడని కోహ్లి.. ఇకపై పొట్టి క్రికెట్‌లో భారత జెర్సీని ధరించేది అనుమానమే.

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు విరాట్‌ను పరిగణలోకి తీసుకోకూడదని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ టీ20 వరల్డ్‌కప్‌ సిద్దం చేసినట్లు సమాచారం. 

కాగా టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగించాల్సిందిగా రోహిత్‌ శర్మను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అందుకు హిట్‌మ్యాన్‌ కూడా అంగీకరించినట్లు సమాచారం. అతడితో పాటు బుమ్రా కూడా టీ20 ప్రపంచకప్‌లో భాగమయ్యేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశంలో విరాట్‌ టీ20 భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. టీ20ల్లో అతడి స్ధానంలో ఇషాన్‌ కిషన్‌కు ఛాన్స్‌ నిర్ణయించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

"మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పత్యర్ధి బౌలర్లను ఎటాక్‌ చేసే ఆటగాడు కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. విరాట్‌ కోహ్లి స్ధానాన్ని వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో భర్తీ చేసే ఛాన్స్‌ ఉంది. అయితే ఐపీఎల్‌-2024 సీజన్‌లో కోహ్లి ప్రదర్శనను కూడా పరిగణలోకి సెలక్టర్లు తీసుకుంటారు అని బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్‌తో పేర్కొన్నారు.
చదవండిIND vs SA: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. షెడ్యూల్‌, జట్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

>
మరిన్ని వార్తలు