ఐపీఎల్‌ 2020: తొలి మ్యాచ్‌లో టాస్‌ ధోనిదే

19 Sep, 2020 19:14 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్రారంభమైంది. కరోనా సంక్షోభం కారణంగా ఎటువంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నిశ్శబ్దంగా మనముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నాలుగుసార్లు చాంపియన్‌ ముంబైతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే జట్టు తలపడుతుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం. చెన్నైతో ముఖాముఖి రికార్డులో రోహిత్‌ శర్మ బృందం 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ధోని దళం 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.(చదవండి: ఐపీఎల్‌ 2020: ‘త్రీ’ వర్సెస్‌ ‘ఫోర్‌’)

మరొకవైపు ముంబై ఇండియన్స్‌ను ఓ చెత్త రికార్డు వేధిస్తోంది.  ఆరంభంలో పేలవం.. మధ్యలో మధ్యస్తం. చివర్లో వీరోచితం.. ఇది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌  శైలి‌. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఇదే తీరు కనబడుతోంది. ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఇప్పుడిదే ఆ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. ఐపీఎల్‌ -2020 సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ ముంబైను తొలి మ్యాచ్‌(ముంబై తలపడిన తొలి మ్యాచ్‌)లో ఓటమి  గత ఏడు సీజన్ల నుంచి వేధిస్తోంది. గత ఏడు సీజన్లుగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా ముంబై తమ తొలి  మ్యాచ్‌ను 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గింది.  ఐదేళ్ల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కానీ ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టలేదు. ఇది ముంబైను సెంటిమెంట్‌ పరంగా కలవర పెట్టడం ఖాయం. (చదవండి: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపేలేదు!)


ముంబై తుది జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌,  పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

సీఎస్‌కే తుది జట్టు
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), మురళీ విజయ్‌, షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌, పీయూష్‌ చావ్లా, లుంగీ ఎన్‌గిడి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు