కేకేఆర్ సంకట స్థితి‌.. గెలిస్తేనే ప్లేఆఫ్‌ అవకాశం

29 Oct, 2020 19:08 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా పెద్దగా ఒరిగేదేంలేదు. కానీ కేకేఆర్‌కు మాత్రం సంకట స్థితి అనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కేకేఆర్‌కు ప్లేఆఫ్‌ అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కింగ్స్‌ పంజాబ్‌కు అన్నే విజయాలు ఉన్నా రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో నాలుగో స్థానంలో ఉండగా..ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ కేకేఆర్‌కు కీలకం కానుంది. మరోవైపు 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 ఓటములతో చివరిస్థానంలో నిలిచిన సీఎస్‌కేకు ప్లేఆఫ్‌ దారులు ఎప్పుడో మూసుకుపోయాయి.

కాగా తొలి అంచె పోటీలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 10 పరగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. సీఎస్‌కే 13, కేకేఆర్‌ 8 విజయాలు నమోదు చేయగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.  ఈ మ్యాచ్‌లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్ స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్‌ శర్మ తుది జట్టులోకి రాగా.. మరోవైపు కేకేఆర్‌లో మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. ప్రసిద్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ ఆడనున్నాడు.

చెన్నై : 
రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్‌), ఎన్ జగదీషన్, సామ్ కరాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కరణ్‌ శర్మ, దీపక్ చాహర్, లుంగీ ఎన్గిడి

కేకేఆర్‌ :
శుభమన్‌ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ , ఇయాన్ మోర్గాన్(కెప్టెన్‌), రింకు సింగ్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు