ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం..

2 Jun, 2021 20:35 IST|Sakshi

ముంబై: రాబోయే దేశవాళీ సీజన్‌లో ముంబై జట్టు హెడ్‌ కోచ్‌గా దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్‌ అమోల్‌ ముజుందార్‌ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్‌ రమేశ్‌ పొవార్‌ ఇటీవలే భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్‌ను ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన ముంబై కోచ్‌ పదవి కోసం భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ తదితర మాజీలు  పోటీపడ్డా, చివరకు ఆ పదవి ముజుందార్‌నే వరించింది. 

ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. జతిన్‌ పరాంజ్‌పే, నీలేశ్‌ కులకర్ణి, వినోద్‌ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్‌ కమిటీ ముజుందార్‌వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, ముంబై కొత్త కోచ్‌గా ఎంపికైన మజుందార్‌ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి. 
చదవండి: అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్‌

మరిన్ని వార్తలు