Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు

14 Nov, 2023 06:32 IST|Sakshi

ఆస్ట్రేలియా క్లబ్‌ క్రికెట్‌లో ఘనత  

గోల్డ్‌కోస్ట్‌: ఆ్రస్టేలియా క్లబ్‌ క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ డివిజన్‌–3 పోటీల్లో ఒక బౌలర్‌ ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్‌ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్లబ్‌ కెపె్టన్‌ గారెత్‌ మోర్గాన్‌ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్‌ ప్యారడైజ్‌ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్‌ క్లబ్‌ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది.

చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్‌ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్‌ తీసిన గారెత్‌ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో నీల్‌ వాగ్నర్‌ (న్యూజిలాండ్‌), అల్‌ అమీన్‌ (బంగ్లాదేశ్‌), అభిమన్యు మిథున్‌ (భారత్‌) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు