రనౌట్‌ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్‌

25 Sep, 2021 20:32 IST|Sakshi
Courtesy: IPL Twitter

అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ చివర్లో రనౌట్‌ విషయంలో హైడ్రామా నెలకొంది. రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చేసిన చిన్న పొరపాటుకు అశ్విన్‌ బతికిపోయాడు. అయితే ముస్తాఫిజుర్‌- అశ్విన్‌ మధ్య చోటుచేసుకున్న సన్నివేశం నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్‌ వేసిన నాలుగో బంతిని అశ్విన్‌ రెహమాన్‌ దిశగా రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రెహమాన్‌ శాంసన్‌ వైపు విసిరాడు. కానీ శాంసన్‌ తనకు అవుట్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ బంతిని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరాడు.

చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే

అయితే అశ్విన్‌ అప్పటికి క్రీజులోకి రాకపోవడం.. ముస్తాఫిజుర్‌ జాగ్రత్తగా అందుకున్న ఈజీగా రనౌట్‌ చేయొచ్చు. కానీ అతను డైవ్‌ చేస్తూ బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ అది పక్క నుంచి వెళ్లిపోవడంతో అశ్విన్ రెండో పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత పైకి లేచిన ముస్తాఫిజుర్‌ అశ్విన్‌ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని దక్కించుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసి 33 పరుగులతో పరాజయం పాలైంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు