తెలంగాణకు వచ్చేసిన క్వీన్‌ ఆఫ్‌ సిల్క్స్‌..

25 Sep, 2021 20:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచీన కాలం నాటి చేనేతలుగా పేరొందిన పైథానీ చేనేత కళ తెలంగాణ ప్రాంతానికీ చేరువైంది. అథీకృత చేనేత సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ చీరలకు ప్రసిద్ధి చెందిన ఓన్లీ పైథానీ బ్రాండ్‌... తెలంగాణ రాష్ట్రంలో తమ శాఖల విస్తరణ షురూ చేసింది. తాజాగా హైదరాబాద్, బంజారాహిల్స్‌లో తమ ఓన్లీ పైథానీ స్టోర్‌ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పైథానీ విశేషాలను తమ సేవల వివరాలను తెలిపారు.

క్వీన్‌ ఆఫ్‌ సిల్క్స్‌..
క్వీన్‌ ఆఫ్‌ సిల్క్స్గా దేశవ్యాప్తంగా పేరొందిన పైథానీ నవవధువు దుస్తులకు సంప్రదాయ చిరునామాగా పేరొందింది. సహజమైన, స్వఛ్చమైన ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన వస్త్రాలతో వినూత్న డిజైన్లుగా ఇవి ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి.  గత 11ఏళ్లుగా పైథానీ చేనేత సంప్రదాయానికి పునర్వైభవం తెచ్చేందుకు ఓన్లీ పైథానీ బ్రాండ్‌ సంకల్పించింది.

అలాగే  పల్లెలు, గ్రామీణ ప్రాంతంలో స్థానిక చేనేత కళాకారుల జీవన స్థితిగతుల బాగు కోసం కృషి చేస్తోంది. తత్ఫలితంగా పైథానీ అందిస్తున్న ప్రతీ చీరా కళాత్మకంగా తయారవడంతో పాటుగా మహారాష్ట్రకు చెందిన పైథానీ చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పుడీ సంప్రదాయ వస్త్ర శోభ తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళల వస్త్రధారణలో భాగం కానుంది. 

చదవండి: Broken Milk:పాలు విరిగాయా? వర్రీ అవద్దు.. ఇలా ఉపయోగించండి!

మరిన్ని వార్తలు