Hrishikesh Kanitkar: భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్‌

6 Dec, 2022 15:48 IST|Sakshi

భారత మహిళల క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా మంగళవారం ప్రకటించింది. డిసెంబర్‌ 9న ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20 నుంచి భారత బ్యాటింగ్‌ కోచ్‌గా కనిత్కర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా హృషికేశ్ కనిత్కర్‌ ప్రస్తుతం  నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

అదే విధంగా భారత మహిళల జట్టు మాజీ హెడ్‌ కోచ్‌ రమేష్ పొవార్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికైన అనంతరం కనిత్కర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.

"భారత సీనియర్‌ మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టులో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. మా జట్టులో సీనియర్‌ క్రికెటర్లతో పాటు అద్భుతమైన యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా నా వంతు బాధ్యతలు నిర్వహించి జట్టును ముందుకు నడిపిస్తాను" అని కనిత్కర్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్


చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు