ఫిక్సింగ్‌ కలకలం.. విండీస్‌ క్రికెటర్‌పై వేటు

24 May, 2023 10:25 IST|Sakshi

వెస్టిండీస్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ డెవాన్‌ థామస్‌పై ఐసీసీ సస్సెన్షన్‌ వేటు వేసింది. లంక ప్రీమియిర్‌ లీగ్‌ 2021లో ఫిక్సింగ్‌ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్‌ లీగ్‌ల్లో బుకీలు కలిసిన విషయాన్ని దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంది.

థామస్‌పై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని..  శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) యొక్క అవినీతి నిరోధక కోడ్‌ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు వెల్లడించింది.

కాగా, డెవాన్‌ థామస్‌ గతేడాదే టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. అతను విండీస్‌ తరఫున ఒక టెస్ట్‌, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్‌ సైతం చేసిన థామస్‌.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IPL 2023 QF 1: సీఎస్‌కే-గుజరాత్‌ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్‌ అయ్యిందా..?

>
మరిన్ని వార్తలు