IPL 2023 Qualifier 1, CSK Vs GT: We Made Basic Errors Which Cost Us The Game Against CSK: Hardik Pandya - Sakshi
Sakshi News home page

CSK Vs GT: ఓడిపోయాం అంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు! మళ్లీ సీఎస్‌కేతోనే: హార్దిక్‌

Published Wed, May 24 2023 10:33 AM

We made basic errors which cost us the game Hardik Pandya - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫియర్‌-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి పాలైంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 157 పరుగులకు ఆలౌటైంది. కాగా తొలి క్వాలిఫియర్‌లో ఓటమిపాలైన గుజరాత్‌కు ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. మే26న అహ్మదాబాద్‌ వేదికగా క్వాలిఫియర్‌-2లో లక్నో లేదా ముంబైతో గుజరాత్‌ తలపడనుంది.

ఇక సీఎస్‌కే చేతిలో ఓటమిపై మ్యాచ్‌ అనంతరం గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాం‍డ్యా స్పందించాడు. మళ్లీ ఫైనల్లో ధోని సారథ్యంలో సీఎస్‌కేతో తలపడాలని భావిస్తున్నట్లు హార్దిక్‌ తెలిపాడు. "తొలుత బౌలింగ్‌లో మేము అంతగా రాణించలేకపోయాం. అదనంగా 15 పరుగులు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. మా ప్లాన్స్‌ను సరిగ్గానే అమలు చేశాం. మిడిల్‌ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా రాణించి పరుగులను కట్టడి చేశారు. కానీ డెత్‌ ఓవర్లలో మాత్రం పరుగులు సమర్పించుకున్నారు.

ఇక దోని తన మాస్టర్‌ మైండ్‌ను మరోసారి ఉపయోగించాడు. తన బౌలర్లను మార్చి మార్చి ఉపయోగిస్తూ.. మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయేలా చేశాడు. కాబట్టి ఈ క్రెడిట్‌ మొత్తం ఎంఎస్‌కే దక్కుతుంది. ఇక ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించాలల్సిన అవసరం లేదు. మళ్లీ మేము రెండు రోజుల తర్వాత క్వాలిఫియర్‌-2లో ఆడబోతున్నాం.

మాకు ఫైనల్‌ చేరేందుకు మంచి అవకాశం. ఇక్కడ గెలిచి మళ్లీ ఫైనల్లో సీఎస్‌కేతో తలపడేందుకు ప్రయత్నిస్తాం. అదే విధంగా నా సోదరుడు కృనాల్‌ సారథ్యంలోని లక్నో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అహ్మదాబాద్‌లో సెకెండ్‌ క్వాలిఫియర్‌లో మేము ఇద్దరం తలపడాలని ఆశిస్తున్నాను" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10వ సారి ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫైనల్‌కు చేరింది. కాగా మే28న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ జరగనుంది.
చదవండి: IPL 2023 QF 1: ఎవరి తరం కాలేదు గుజరాత్‌ మెడలు వంచడం.. సీఎస్‌కే చేసి చూపించింది..!


 

Advertisement
Advertisement