IND vs AUS: 150 కి.మీ వేగంతో సూపర్‌ డెలివరీ.. దెబ్బకు కెప్టెన్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

16 Feb, 2023 12:16 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  గ్లాడియేటర్స్‌.. ముల్తాన్‌ బౌలర్ల దాటికి కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ముల్తాన్‌ బౌలర్లలో పేసర్‌ ఇహ్సానుల్లా ఐదు వికెట్లతో గ్లాడియేటర్స్‌ విన్ను విరచగా.. సామీన్‌ గుల్‌, అబ్బాస్‌ అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించారు.

అదే విధంగా గ్లాడియటర్స్‌ బ్యాటర్లలో జాసన్‌ రాయ్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ముల్తాన్‌ బ్యాటర్లలో రిలీ రుసౌ 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇహ్సానుల్లా సూపర్‌ డెలివరీ..
ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్‌ పేసర్‌ ఇహ్సానుల్లా సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భుతమైన బంతితో గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఇహ్సానుల్లా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 150.3 కి.మీ వేగంతో వేసిన బంతికి సర్ఫరాజ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి నేరుగా వెళ్లి స్టంప్సను గిరాటేసింది.

దీంతో సర్ఫరాజ్ అహ్మద్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇక ఇహ్సానుల్లా దెబ్బకు సర్ఫరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్‌, సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు