ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రకటన  

14 Sep, 2023 01:53 IST|Sakshi

 ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రకటన  

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) క్లబ్‌ జట్లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎంపిక చేసిన పలువురు అగ్రశ్రేణి సీనియర్, జూనియర్‌ ఆటగాళ్లను ఐఎస్‌ఎల్‌ క్లబ్‌లు విడుదల చేయలేదు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి మినహా మిగతా వారంతా అనుభవంలేని ఆటగాళ్లే ఉన్నారు.

సునీల్‌ ఛెత్రితోపాటు సీనియర్‌ గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్, సందేశ్‌ జింగాన్‌లను ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎంపిక చేసింది. ఆసియా క్రీడల కోసం గుర్‌ప్రీత్‌ను బెంగళూరు ఎఫ్‌సీ, సందేశ్‌ను గోవా ఎఫ్‌సీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు. భారత జట్టు వెంట రెగ్యులర్‌ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ వెళ్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆసియా క్రీడల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఈనెల 19న మొదలుకానుండగా... ఐఎస్‌ఎల్‌ పదో సీజన్‌కు ఈనెల 21న తెరలేస్తుంది.  

భారత ఫుట్‌బాల్‌ జట్టు: ధీరజ్‌ సింగ్, గుర్మీత్‌ సింగ్‌ సుమిత్‌ రాఠి, నరేందర్‌ గెహ్లోట్, అమర్జీత్‌ సింగ్, శామ్యూల్‌ జేమ్స్, కేపీ రాహుల్, అబ్దుల్‌ రబీ, ఆయుశ్‌ దేవ్, బ్రైస్‌ మిరిండా, అజ్ఫర్‌ నూరాని, రహీమ్‌ అలీ, విన్సీ బరెటో, సునీల్‌ ఛెత్రి, రోహిత్‌ దాను, గుర్‌కీరత్‌ సింగ్, అనికేత్‌ జాదవ్‌. 

మరిన్ని వార్తలు