మ్యాచ్‌కు ముందు ధోని గుడ్‌లక్‌ చెప్పడు.. కారణం అదే

21 Apr, 2021 14:30 IST|Sakshi
Courtesy: IPL Twitter

ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రగ్యాన్‌ ఓజా ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏ కెప్టెన్‌ అయినా వారి టీమ్‌కు గుడ్‌లక్‌ చెప్పి సూచనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే ధోని మాత్రం మ్యాచ్‌కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు ఎలాంటి గుడ్‌లక్‌ చెప్పడని.. అసలు అలా చెప్పడం మానేశాడని ఓజా పేర్కొన్నాడు. అయితే ధోని ఇలా చేయడానికి ఒక కారణం ఉందని ఓజా పేర్కొన్నాడు.

''ధోని మ్యాచ్‌కు ముందు తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా ఆల్‌ ది బెస్ట్‌ చెబితే మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరుగుతుందని ధోని నమ్మాడు. అందుకే అతను ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడం కూడా మానేశాడు. అంతేగాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ధోని దగ్గరకి వెళ్లడానికి ఆలోచిస్తారు. ఒకానొక సందర్భంలో ధోనినే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. తనకు కొన్ని సెంటిమెంట్స్‌ ఉన్నాయని.. వాటిని బలంగా నమ్ముతానని.. అందుకే మ్యాచ్‌కు ముందు నా జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పనని.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కూడా నాకు ఎలాంటి విషెస్‌ చెప్పాలని తాను కోరుకోనని చెప్పాడు.'' అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సీఎస్‌కే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కాగా నేడు ముంబై వేదికగా సీఎస్‌కే కేకేఆర్‌ను ఎదుర్కోనుంది.
చదవండి: 'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'

బౌలర్‌ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్‌ దాటితే మాత్రం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు