IPL 2022- Suresh Raina: సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వారికే ఉంది.. అంబటి రాయుడు, బ్రావో ఇంకా: రైనా

23 Mar, 2022 14:23 IST|Sakshi
ఎంఎస్‌ ధోని(PC: IPL)

IPL 2022- Suresh Raina: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. నాలుగుసార్లు టైటిల్‌ గెలిచి సత్తా చాటింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో విన్నర్‌గా నిలిచింది. సీఎస్‌కే ప్రయాణం ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగడంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పాత్ర మరువలేనిది. తలా లేని చెన్నై జట్టును ఊహించడం కష్టం. అంతగా తనదైన ముద్ర వేశాడు ధోని.

మరి ధోని క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌ బై చెబితే అతడి స్థానాన్ని భర్తీ చేయగల సారథి ఎవరా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సురేశ్‌ రైనాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందించిన రైనా.. ‘‘రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్‌ ఊతప్ప, డ్వేన్‌ బ్రావో.. వీరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహించ గల సత్తా ఉంది. ఎంఎస్‌ ధోని వారసుడిగా జట్టును ముందుకు నడిపే శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయి.

ఆటపై వారికున్న అవగాహన ఇందుకు దోహదం చేస్తుంది. ఇక ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా అవతారం ఎత్తడం గురించి రైనా చెబుతూ.. ‘‘నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, పీయూశ్‌ చావ్లా.. ఇలా నా స్నేహితుల్లో చాలా మంది ఇప్పటికే కామెంటేటర్లుగా ఉన్నారు.

రవి భాయ్‌(రవి శాస్త్రి) కూడా ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా ఉన్నారు కాబట్టి నాకు ఈ టాస్క్‌ మరింత సులువు అవుతుందనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన రైనా మెగా వేలం- 2022లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

చదవండి: IPL 2022- Virat Kohli: చిన్న బ్రేక్‌ మాత్రమే.. 2023లో మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి! ఎందుకంటే...

మరిన్ని వార్తలు