Ravichandran Ashwin: పాతది గుర్తొచ్చిందేమో.. చేయాలనుకొని చేయలేకపోయాడు

2 Apr, 2023 19:19 IST|Sakshi

మన్కడింగ్‌ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఐపీఎల్‌లో జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేయడం ద్వారా అశ్విన్‌ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడంటే మన్కడింగ్‌ను రనౌట్‌గా చట్టబద్దం చేశారు కానీ.. అప్పట్లో అశ్విన్‌ చర్యపై రెండుగా చీలిపోయారు. క్రీడాస్పూర్తిని దెబ్బతీశాడంటూ కొందరు పేర్కొంటే.. అశ్విన్‌ చేసింది న్యాయమేనని మరికొందరు తెలిపారు.

ఆ తర్వాత కూడా దీనిపై పెద్ద చర్చే నడిచింది. కాగా గతేడాది మన్కడింగ్‌(నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో బంతి విడువక ముందే బ్యాటర్‌ క్రీజు వదిలితే రనౌట్‌ చేయడం)ను ఐసీసీ రనౌట్‌గా మారుస్తూ నిబంధనను సవరించింది. ఏది ఏమైనా ఒక రకంగా అశ్విన్‌ మన్కడింగ్‌కు మూల కారకుడు అని అభిమానులు పేర్కొంటునే ఉన్నారు.

తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అశ్విన్‌ మరోసారి మన్కడింగ్‌ చేయబోయాడు.  ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లు ఇది చోటుచేసుకుంది. ఓవర్‌లో తొలి బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న ఆదిల్‌ రషీద్‌ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్‌ బంతిని విడవకుండా బెయిల్స్‌ వైపు బంతిని ఉంచాడు. అయితే తన తొలి మన్కడింగ్‌ గుర్తొచ్చిందేమో అవకాశాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: 

మరిన్ని వార్తలు