IPL 2024 SRH VS MI: 60 బంతుల్లో 148 పరుగులు.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికం

27 Mar, 2024 23:11 IST|Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌. 

ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో 10 ఓవర్ల అనంతరం అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 2 వికెట్ల​ నష్టానికి 148 పరుగులు చేసింది. దీనికి ముందు తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్‌ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో ముంబై తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

కాగా, 278 అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. సన్‌రైజర్స్‌కు ధీటుగా బదులిస్తుంది. తొలి 10 ఓవర్ల అనంతరం ముంబై 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలి 10 ఓవర్ల అనంతరం చేసిన స్కోర్లలో ఇది రెండో అత్యధికం. 10 ఓవర్ల తర్వాత టాప్‌-2 స్కోర్లు ఒకే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం.

ఐపీఎల్‌లో మొదటి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు..

  • 148/2 - SRH vs MI, హైదరాబాద్, 2024
  • 141/2 - MI vs SRH, హైదరాబాద్, 2024
  • 131/3 - MI vs SRH, అబుదాబి, 2021
  • 131/3 - PBKS vs SRH, హైదరాబాద్, 2014
  • 130/0 - డెక్కన్ ఛార్జర్స్ vs MI, ముంబై, 2008
  • 129/0 - RCB vs PBKS, బెంగళూరు, 2016

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు..

  • 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024
  • 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013
  • 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023
  • 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016
  • 246/5 - CSK vs RR, చెన్నై, 2010
     

Election 2024

మరిన్ని వార్తలు