వింబుల్డన్‌కు నెంబర్‌ వన్‌ దూరం.. మరి ఒలింపిక్స్‌ సంగతి?

18 Jun, 2021 08:58 IST|Sakshi

టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ రఫెల్‌ నాదెల్‌ వింబుల్డన్‌-2021, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోనని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, యువ సంచలనం నయోమి ఒసాకా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో ఆడబోనని తెలిపింది. ఈ మేరకు ఒసాకా ఏజెంట్‌ స్టువర్ట్‌ డుగుయిడ్‌ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె ఆడే అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. 

కాగా, వ్యక్తిగత కారణాలతో నయోమి ఒసాకా వింబుల్డన్‌ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. సన్నిహితులు, కుటుంబంతో కొద్దిరోజులు ఆమె గడపాలనుకుంటోంది. తద్వారా కొత్త ఉత్సహాంతో తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనే అవకాశాలు కొద్ది రోజుల తర్వాత పరిశీలిస్తాం అంటూ స్టువర్ట్‌ పేరు మీద ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ అయ్యింది. 

చూడండి: జపన్‌ యువసంచలనం ఫొటోలు

ఇదిలా ఉంటే గత నెలలో ఫ్రెంచ్‌ టోర్నీ నుంచి నాటకీయ పరిణామాల తర్వాత నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ నయోమి ఒసాకా వైదొలగిన విషయం తెలిసిందే. మీడియా సమావేశం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుందని పేర్కొంటూ ప్రెస్‌ మీట్‌కు ఆమె విముఖత వ్యక్తం చేసింది. ఈ చర్యపై టోర్నీ నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించడంతో పాటు వేటు హెచ్చరిక చేశారు. అయితే ఈ లోపే 23 ఏళ్ల యువ సంచలనం టోర్నీ నుంచి నిష్క్రమించి టెన్నిస్‌ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది.

చదవండి: ఒసాకాకు భారీ ఝలక్‌

మరిన్ని వార్తలు