చెన్నై వర్సెస్‌ కోల్‌కత : ఆధిపత్యం ఎవరిదో

7 Oct, 2020 19:07 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్ ‌13వ సీజన్‌లో ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య అబుదాబి వేదికగా ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన సీఎస్‌కే రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్‌ నాలుగు మ్యాచ్‌లాడి రెండు విజయాలు, రెండు ఓటములతో 4వ స్థానంలో ఉంది. కాగా సీఎస్‌కే కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ల విధ్వంసంతో ఏకంగా 10వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్‌ ఓటములకు స్వస్తి పలికింది. అటు కేకేఆర్‌ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుస్తూ.. మరొక మ్యాచ్‌లో ఓడుతూ వస్తుంది. కాగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 14 గెలుపొందగా.. కేకేఆర్‌ 8 గెలిచింది.

ఇరు జట్ల బలబలాలు
సీఎస్‌కే విషయానికి వస్తే.. షేన్‌ వాట్సన్‌, డు ప్లెసిస్‌, రాయుడు, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, జడేజా, బ్రేవో, సామ్‌ కర్జన్‌లతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగానే ఉంది. ఇక ఆరంభంలోనే వాట్సన్‌, డు ప్లెసిస్‌ మరోసారి రాణిస్తే మాత్రం కేకేఆర్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో దీపక్‌ చాహర్‌, కరణ్‌ శర్మ, శార్థూల్‌ ఠాకూర్‌లతో సమతుల్యంగా కనిపిస్తుంది. 

కేకేఆర్‌  విషయానికి వస్తే.. సునీల్‌ నరైన్‌ ఓపెనర్‌గా విఫలమవుతూ వస్తున్న అతన్నే కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నరైన్‌ సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌లో నరైన్‌ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్‌ పంపే అంశంపై కేకేఆర్‌ పరిశీలిస్తుంది. ఇక బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌లు రాణిస్తుండగా.. దినేష్‌ కార్తిక్‌, ఆండ్రీ రసెల్‌ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. మరి ఈసారైనా రసెల్‌ మెరుపులు మెరిపిస్తాడా లేదా అనేది చూడాలి.

గత మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేకపోవడం వల్లే కేకేఆర్‌ ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. మంచి ఫామ్‌లో ఉన్న మోర్గాన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా బౌలింగ్‌లో పాట్‌ కమిన్స్‌, కమలేష్‌ నాగర్‌ కోటి, శివమ్‌ మావిలతో పటిష్టంగానే కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే పియూష్‌ చావ్లా స్థానంలో కరణ్‌ శర్మను తుది జట్టులోకి తీసుకుంది. కాగా కేకేఆర్‌లోమాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు.

సీఎస్‌కే జట్టు : 
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవో, సామ్‌ కరాన్‌,కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

కేకేఆర్‌ జట్టు : 
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), సునీల్‌ నరైన్‌, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ త్రిపాఠి, శివం మావి

మరిన్ని వార్తలు