Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం

15 Sep, 2021 08:33 IST|Sakshi

Lasit Malinga Retirement.. శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ లసిత్‌ మలింగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మలింగ సాధించిన రికార్డులను బ్రేక్‌ చేసే అవకాశాలు ఉ‍న్నప్పటికీ ఒక రికార్డు మాత్రం ఇప్పటివరకు పదిలంగానే ఉంది. అదే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు.. అందునా ఒకే రికార్డును రెండుసార్లు సాధించడం ఒక్క మలింగకే చెల్లింది. మరి ఆ రికార్డు ఇక ఎవరికి సాధ్యమవుతుందో చూడాలి. ఇక మలింగ సాధించిన 'నాలుగు బంతుల్లో.. నాలుగు వికెట్ల' రికార్డును ఒకసారి పరిశీలిద్దాం.


2007 వన్డే ప్రపంచకప్‌ .. 2019లో మలింగ

చదవండి: మలింగ తరహాలో అరుదైన ఫీట్‌.. అయినా ఓడిపోయారు

12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్‌ గుడ్‌బై

2007 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ప్రొవిడెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45వ ఓవర్‌ చివరి రెండు బంతుల్లో పొలాక్, హాల్‌లను అవుట్‌ చేసిన అతను, 47వ ఓవర్‌ తొలి రెండు బంతుల్లో కలిస్, ఎన్తినిలను పెవిలియన్‌ పంపించాడు. అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును దాదాపు 12 ఏళ్ల పాటు ఎవరు బ్రేక్‌ చేయలేకపోయారు. తన రికార్డును తానే బ్రేక్‌ చేస్తూ మరోసారి అదే రిపీట్‌ చేశాడు. 2019లో పల్లెకెలెలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌ మూడో ఓవర్లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను అవుట్‌ చేయడం విశేషం.


మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి20లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20లలో 107 వికెట్లు కలిపి మొత్తం 546 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతడిదే పైచేయి. అంతేకాదు, పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ కూడా అతడే.

చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు

మరిన్ని వార్తలు