హెచ్‌సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం​

10 Nov, 2023 11:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)కు, విశాఖ ఇండస్ట్రీస్‌కు మధ్య నెలకొన్న వివాదాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా వాణిజ్యకోర్టును హైకోర్టు ఆదేశించింది. అక్కడే సమస్యపై తుది పరిష్కారానికి రావాలని ఇరు పార్టీలకు సూచించింది.

ఉప్పల్‌ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్‌ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు అటాచ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్‌ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

మరిన్ని వార్తలు