చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. ఆసియా కప్‌లో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు

20 Nov, 2022 10:47 IST|Sakshi

Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్‌ టేబుల్‌ టెన్నిస్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్‌ నంబర్‌ 2 ప్లేయర్‌, జపాన్‌ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మ‌నికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్‌ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు