WPL 2023: ముంబై జట్టు హెడ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

6 Feb, 2023 08:22 IST|Sakshi

డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ తమ జట్టు హెడ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. . 2017లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్‌కు కోచింగ్‌లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్‌లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చార్లెట్‌ 10,273 పరుగులు సాధించింది.

ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్‌లో సదరన్‌ వైపర్స్‌ జట్టుకు, సదరన్‌ బ్రేవ్‌ (హండ్రెడ్‌ టోర్నీ) జట్టుకు, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన చార్లెట్‌ అమెరికా క్రికెట్‌ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్‌ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది.

ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా భారత బౌలింగ్‌ దిగ్గజం జులన్‌ గోస్వామిని తమ జట్టు మెంటార్,  బౌలింగ్‌ కోచ్‌గా ముంబై నియమించుకుంది. మరోవైపు భారత  మాజీ ఆల్‌రౌండర్‌ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు.
చదవండి: టాపార్డరే కీలకం: మిథాలీ

>
మరిన్ని వార్తలు