గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?

16 Oct, 2020 17:00 IST|Sakshi

షార్జా: ప్రస్తుత ఐపీఎల్‌లో పదే పదే ట్రోలింగ్‌ బారిన పడుతున్న క్రికెటర్లలో కింగ్స్‌ పంజాబ్‌ ఆల్‌ రౌండర్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జిమ్మీ నీషమ్‌ ఒకడు. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఓడిపోయిన తరుణంలో నీషమ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో నీషమ్‌ను టార్గెట్‌ చేస్తూ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా నీషమ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు నీషమ్‌ పూర్తిస్థాయి ఆల్‌ రౌండర్‌ కానప్పుడు జట్టులో ఎందుకు అంటూ తన యూట్యూబ్‌ చానల్‌లో ప్రశ్నించాడు. అటు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, ఇటు బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాని ఆల్‌రౌండర్‌ అంటూ నీషమ్‌కు చురకలంటించాడు. (4 ఏళ్ల నాటి సల్మాన్‌ ట్వీట్‌ వైరల్‌..)

దీనికి నీషమ్‌ సైతం ఘాటుగానే సమాధానం చెప్పడం, ఆపై ఆకాశ్‌ చోప్రా కూడా మళ్లీ రిప్లై ఇవ్వడం కూడా జరిగాయి. అది కింగ్స్‌ పంజాబ్‌ ఓడిపోయిన మ్యాచ్‌. ఇప్పడు కింగ్స్‌ పంజాబ్‌ గెలిచిన మ్యాచ్‌ కూడా నీషమ్‌పై విమర్శలు తప్పడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ చివరి బంతికి గెలిచింది. ఆ తరుణంలో కింగ్స్‌ పంజాబ్‌ శిబిరం అంతా సంబరాలు చేసుకుంటుంటే నీషమ్‌ మాత్రం అలానే కూర్చొని ఉన్నాడు. మొహం అదోలా పెట్టి తదేకంగా ఆలోచనలో మునిగిపోయాడు.

మ్యాచ్‌ ఎవరు గెలిస్తే మనకెందుకెలా అన్నట్లు డగౌట్‌ కూర్చొని ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు. నీషమ్‌ ఉన్నచోట నుంచి లేవకుండా జట్టును ఉత్సాహపరచకపోవడంతో దాన్ని ఫోటోలు తీసిన భిమానులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.. మ్యాచ్‌ గెలిచారు కదా మొహం అలా పెట్టావేంటి అంటూ విమర్శించారు. ఒకవైపు హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌లు చప్పట్లతో జట్టును అభినందిస్తూ ఉంటే నీషమ్‌ ఏమి పట్టన్నట్లు ఉండిపోయాడు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. , చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌కు విజయం దక్కింది. (కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై)

Poll
Loading...
మరిన్ని వార్తలు